‘ఆ కేసులో డేరా బాబా స్టేట్‌మెంట్‌ నమోదు’   | cbi records dera baba statement on castration case | Sakshi
Sakshi News home page

‘ఆ కేసులో డేరా బాబా స్టేట్‌మెంట్‌ నమోదు’  

Oct 11 2017 8:20 PM | Updated on Oct 12 2017 7:28 AM

cbi records dera baba statement on castration case

సాక్షి,న్యూఢిల్లీ: డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ డేరా ప్రాంగణంలో 400 మంది తన అనుచరుల వృషణాలను బలవంతంగా తొలగించారన్న కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిం‍ది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీబీఐ విచారణను కోరుతూ హన్సరాజ్‌ చౌహాన్‌ అనే డేరా అనుచరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో డేరా చీఫ్‌ను ప్రశ్నించినట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు. అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తూ రోహ్తక్‌ జైలులో ఉన్న గుర్మీత్‌ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.పంజాబ్‌ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు 2015, జనవరిలో ఈ అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement