సీబీఐ విచారణ జరపాలి | CBI inquiry must be performed | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణ జరపాలి

Apr 14 2016 3:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

సీబీఐ విచారణ జరపాలి - Sakshi

సీబీఐ విచారణ జరపాలి

రాజస్తాన్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దళిత బాలిక అత్యాచారంపై రాహుల్

 జైపూర్: రాజస్తాన్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బార్మెర్ జిల్లా తిర్మోహి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌తో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై విశ్వాసం కోల్పోయిందని రాహుల్ చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోలాగే ఈ కేసునూ అణచిపెట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన కుమార్తెకు న్యాయం జరగాలనే తండ్రి కోరుకుంటున్నాడని తెలిపిన రాహుల్.. సీబీఐకి కేసు అప్పగించడం ద్వారా ఇక ఆ కేసులో న్యాయం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement