ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీలు | CBDT notifies tax exemption on 7 districts in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీలు

Sep 30 2016 6:54 PM | Updated on Sep 4 2017 3:39 PM

ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీలు

ఏపీలోని 7 జిల్లాలకు పన్ను రాయితీలు

ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి.

 ఏడు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టిన వారికి 15శాతం అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15శాతం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. విభజన చట్టం అమలులోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఈ రాయితీ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement