మద్యం డోర్‌ డెలివరీ : అందుబాటులో యాప్

Can Order liquor Online In Chhattisgarh - Sakshi

మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా విక్రయం

రాయ్‌పూర్‌ : లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చేలా కేంద్రం మద్యం దుకాణాలకు సడలింపులు ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజామున నుంచే షాపుల ముందు బారులు తీరారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను సైతం రూపొందించింది. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..)

ఎలా లాగిన్ కావాలి..
ఛత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎమ్‌సీఎల్‌)  ఆధ్యర్యంలో లిక్కర్‌ విక్రయాల కోసం ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను మందుబాబులకు అందుబాటులో ఉంచింది. లిక్కర్‌ కావాల్సిన వాళ్లు తొలుత యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ సంఖ్యతో పాటు వినియోగదారుడి పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరచాలి. అనంతరం ఫోన్‌ను వచ్చిన పాస్‌వార్డుతో యాప్‌లోకి లాగిన్‌ అ‍య్యి సమీపంలో వైన్‌ షాపులలో నచ్చిన మందును కొనుగోలు చేసుకోవచ్చు.  అనంతరం డెలివరీ బాయ్‌ ద్వారా సరుకును ఇంటి వద్ద డెలివరీ చేస్తారు. దీనికి ఆన్‌లైన్‌లోనే పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. (ధరలు పెంచడానికి కారణం అదే: సీఎం జగన్‌)

అలాగే ప్రతి డెలివరీకి అదనంగా రూ.120 వసూలు చేయనున్నారు. ఒక్కో వినియోగదారుడికి 5000 మిల్కీ లీటర్‌ మద్యం విక్రయించబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ యాప్‌ అందుబాటులో ఉంటుందని అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కాగా రాష్ట్రం వ్యాప్తంగా గల గ్రీన్‌ జోన్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో రాయ్‌పూర్‌, కోబ్రా తప్ప మిగతా జిల్లాలన్నీ గ్రీన్‌ జోన్లోనే ఉన్నాయి. దీంతో దాదాపు రాష్ట్ర మంతా మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top