కేంద్ర కేబినెట్‌లో మార్పులు

Cabinet Portfolio Changes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా పీయూష్ గోయల్‌కు అధనపు బాధ్యతలు అప్పగించారు. మూత్రపిండ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ జైట్లీ కొలుకునే వరకు పీయూష్‌ గోయల్‌ ఆర్థిక శాఖ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆయన రైల్వేశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎస్‌ఎస్‌ అహ్లువాలియాకు ఎలక్ట్రానిక్స్ & ఐటి శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని తప్పించి.. రాజ్యవర్ధన్ సింగ్‌ రాథోడ్‌కు సమాచార శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇకపై ఆమె జైళీ శాఖ మంత్రిగానే కొనసాగనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top