బ్రిటన్ 198 మంది భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించనుంది.
కోల్‌కతా: విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు బ్రిటన్ ‘గ్రేట్ క్యాంపెయిన్ పేరిట 2017లో 198 మంది భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించనుంది.
ఇందుకోసం రూ. 85 కోట్లను కేటాయించినట్లు బ్రిటిష్ కౌన్సిల్ ఈస్ట్ ఇండియా సంస్థ డైరెక్టర్ దేవాంజన్ చక్రవర్తి తెలిపారు. ఇంజినీరింగ్, లా, డిజైన్, మెనేజ్ మెంట్ కోర్సుల్లో 29 అండర్ గ్రాడ్యుయేట్, 169 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్టు చెప్పారు.