బర్త్ డే రోజు అదృశ్యం.. శవమై ప్రత్యక్షం | Bodies of two missing girl youth found in Bango dam | Sakshi
Sakshi News home page

బర్త్ డే రోజు అదృశ్యం.. శవమై ప్రత్యక్షం

Dec 9 2015 7:24 PM | Updated on Sep 3 2017 1:44 PM

బర్త్ డే రోజు అదృశ్యం.. శవమై ప్రత్యక్షం

బర్త్ డే రోజు అదృశ్యం.. శవమై ప్రత్యక్షం

నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు యువతులు బుధవారం ఓ డ్యామ్లో శవాలుగా తేలారు.

రాయ్పూర్: నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు యువతులు బుధవారం ఓ డ్యామ్లో శవమై కనిపించారు. ఈ ఘటన చత్తీస్గఢ్ లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కోర్బా జిల్లా బాంగో టౌన్లో ఎరినా(23) నివాసం ఉండేది. ఆమె స్నేహితురాలు నీలు యాదవ్(22) పాలీ ప్రాంతంలో ఉండేది. ఈ నెల 5న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితురాలు నీలుతో కలిసి బయటకు వెళ్లింది. కూతురి ఆచూకీ తెలియకపోవడంతో 6న ఎరినా తండ్రి ఫిర్యాదు చేశారని పాలీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీఎస్ శర్మ తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు యువతుల మృతదేహాలు కోర్బా లోని బాంగో డ్యామ్లో కనిపించాయి.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి యువతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందితే యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఎవరైనా హత్య చేశారా అనేది బయటపడుతుందన్నారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టినట్లు సీఎస్ శర్మ  వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement