రేపు ఢిల్లీకి సియాచిన్ జవాన్ల మృతదేహాలు | Bodies of 9 soldiers likely to be brought to Delhi tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీకి సియాచిన్ జవాన్ల మృతదేహాలు

Feb 14 2016 6:59 PM | Updated on Sep 3 2017 5:39 PM

సియాచిన్ ఘటనలో ప్రాణాలుకోల్పోయిన భారత సైనికుల మృతదేహాలను సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే సాధ్యమవుతుందని సైనికాధికారులు అంటున్నారు

న్యూఢిల్లీ: సియాచిన్ ఘటనలో ప్రాణాలుకోల్పోయిన భారత సైనికుల మృతదేహాలను సోమవారం ఢిల్లీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అది కూడా వాతావరణం అనుకూలిస్తేనే సాధ్యమవుతుందని సైనికాధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఖార్దుంగ్లా ప్రాంతంలో పరిస్థితి దుర్భరంగానే ఉందని, అయినప్పటికీ సైనికుల మృతదేహాలు తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని అధికారులు చెప్పారు.

ఈ నెల 3న భారీ అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం సియాచిన్లో భారీ మంచుకొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 10మంది సైనికులు పడగా వారిలో ఓసైనికుడు హనుమంతప్ప తొలుత కొన ప్రాణాలతో భయటపడి అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత మిగిలిన తొమ్మిది మంది మృతదేహాలు ఆలస్యంగా బయటపడ్డాయి. వాటినే రేపు ఢిల్లీకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరంతా బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మధురై, పుణె, హైదరాబాద్ ప్రాంతాలకు చెందినవారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement