పడవ బోల్తా; 8 మంది మృతి | Boat Capsizes Off Karwar In Karnataka | Sakshi
Sakshi News home page

Jan 21 2019 7:24 PM | Updated on Jan 21 2019 7:51 PM

Boat Capsizes Off Karwar In Karnataka - Sakshi

కర్ణాటకలో కర్వార్‌లో సోమవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.

బెంగళూరు: కర్ణాటకలో కర్వార్‌లో సోమవారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ‘ప్రమాద సమయంలో పడవలో 26 మంది ఉన్నారు. 17 మందిని మరో పడవలో ఉన్నవారు కాపాడారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌ సహాయంతో ఎనిమిది మృతదేహాలను వెలికితీశాం. గల్లంతైన మరొకరి కోసం గాలింపు కొనసాగుతుంది. గోవా నుంచి రప్పించిన డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సహాయంతో సహాయక చర్యలు చేపట్టామ’ని నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.

కర్వార్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఆలయానికి వెళ్లి పడవలో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తన కళ్లెదుటే ఈ దుర్ఘటన చోటే చేసుకుందని స్థానిక ప్రజాప్రతినిధి రూపాలీ నాయక్‌ తెలిపారు. తాము మరో పడవలో పయాణిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని రక్షించినట్టు వెల్లడించారు. తర్వాత నావికాదళం రంగంలోకి దిగిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement