‘ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు’

BJP Releases Manifesto For Rajasthan Elections - Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర భవిష్యత్‌కు బీజేపీ ఎన్నికల ప్రణాళిక దిక్సూచీగా మారుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ఇక రాజస్ధాన్‌లో రానున్న ఐదేళ్లలో ప్రైవేట్‌ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి వసుంధరా రాజె హామీ ఇచ్చారు. ఏటా 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

2013లో ఇచ్చిన హామీలను 94 శాతం మేర రాజస్ధాన్‌ ప్రభుత్వం నెరవేర్చిందని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌, సీఎం వసుంధర రాజె సమక్షంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికతో రాజస్ధాన్‌ అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని జైట్లీ పేర్కొన్నారు.

రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా పాగా వేయాలని విపక్ష కాంగ్రెస్‌ ప్రచారంలో దూకుడు పెంచగా, అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. డిసెంబర్‌ 7న రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top