'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్ | BJP raises Bhagwant Mann video in Lok Sabha | Sakshi
Sakshi News home page

'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్

Jul 22 2016 11:59 AM | Updated on Sep 4 2017 5:51 AM

'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్

'వీడియో'పై దద్దరిల్లిన పార్లమెంట్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం దద్దరిల్లాయి. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో పార్లమెంట్ ఉభయ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ బాదల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తప్పనిసరిగా దర్యాప్తు విచారించాలని, పార్లమెంట్ కార్యకలాపాలను వీడియో తీయడం వెనుకున్న ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. తన చర్యను భగవంత్ సమర్థించుకున్నారని, మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎదుట హాజరై భగవంత్ వివరణయిచ్చారు.

జీవో అవర్ లో విపక్షాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చూపించేందుకే వీడియో తీశానని భగవంత్ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చలు లక్కీ డ్రా మాదిరిగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతకు భంగం కలిగించలేదన్నారు. జీవో అవర్ లో చేసిన వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో భగవంత్ వివాదంలో చిక్కుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement