
ఆ గ్రామంలో చైనా వస్తువులు నిషేధం
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా ఒబ్రా గ్రామ పంచాయతీ చైనా వస్తువులను నిషేధించింది.
పట్నా: బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా ఒబ్రా గ్రామ పంచాయతీ చైనా వస్తువులను నిషేధించింది. పాకిస్తాన్‌కు చైనా మద్దతునిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వస్తువులను అమ్మినా, కొన్నా జరిమానా తప్పదని హెచ్చరించింది.‘భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా మద్దతిస్తున్నందున చైనా కూడా మనకు శత్రువే. అందుకే చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆ దేశ వస్తువులను నిషేధించాలని పంచాయతీ సమావేశంలో నిర్ణయించాం’ అని సర్పంచ్ గుడియాదేవీ చెప్పారు.