ఎంపీగారి పిల్లల్ని వాయించారు | Bihar Law-maker's Son and Nephew Thrashed Allegedly Over Parking Dispute in South Delhi | Sakshi
Sakshi News home page

ఎంపీగారి పిల్లల్ని వాయించారు

Apr 7 2015 9:11 AM | Updated on Sep 2 2018 4:37 PM

ఎంపీగారి పిల్లల్ని వాయించారు - Sakshi

ఎంపీగారి పిల్లల్ని వాయించారు

న్యూఢిల్లీ: పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తి ఓ బీహార్ ఎంపీ కుమారుడు, అల్లుడుని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు.

న్యూఢిల్లీ: పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తి ఓ బీహార్ ఎంపీ కుమారుడు, అల్లుడుని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దీంతో వారిద్దరూ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలో జహనాబాద్ ఎంపీ అరుణ్ కుమార్ కుమారుడు రితురాజ్(20), అతడి మేనల్లుడు రిషాబ్(20) ఎంపీకి ఉన్న అధికార నివాసం నుంచి సౌత్ ఎక్స్టెన్షన్ అనే మరో నివాసానికి రాగా అక్కడ తమ గేట్ ముందు కొందరు వ్యక్తులు స్కూటీలు పార్క్ చేసి ఉండటం గమనించారు.

ఆ స్కూటీలపై వచ్చిన వారంతా అక్కడే ఉన్న తమ బంధువులను చూసేందుకు వచ్చారు. అయితే, వాటిని తమ గేటు ముందునుంచి తీయాలని రితురాజ్ కోరగా.. మనోహర్లాల్ అనే వ్యక్తి, అతడి స్నేహితులు కలిసి వారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు వచ్చిన కొందరు మహిళలను చెత్త మాటలతో దూషించారు. దీంతో రితురాజ్ భుజం దెబ్బతినగా, రిషాబ్కు పలు గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement