పశ్చిమబెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎం మమతా బెనర్జీపై ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎం మమతా బెనర్జీపై ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సాయం చేస్తుందన్నారు. ఆయన బుధవారమిక్కడ ప్రారంభమైన పశ్చిమ బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో ప్రసంగించారు.
రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడానికి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉండాలన్నారు. రాష్ట్రం నుంచి బయటికి తరలిపోతున్న పరి శ్రమలను తిరిగి రప్పించాలని అన్నారు. జైట్లీకి ముందు సదస్సును ప్రారంభించిన మమత.. రాష్ట్రాభివృద్ధికి రాజకీయ విభేదాలు అడ్డురావని చేసిన వ్యాఖ్యలపై జైట్లీ స్పందించారు.
బెంగాల్ అభివృద్ధి కోసం అండగా నిలుస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మమత, ఓ కేంద్ర మంత్రితో వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. కాగా, శారదా చిట్ స్కామ్‌లో తృణమూల్ నేతలు పట్టుబడుతున్నందువల్లే ఆ పార్టీ రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటోందని జైట్లీ హౌరాలో అన్నారు.