తేనెటీగల విజృంభణ.. | Bees attacked human while on earthquake impact | Sakshi
Sakshi News home page

తేనెటీగల విజృంభణ..

Apr 26 2015 3:03 AM | Updated on Oct 20 2018 6:37 PM

తేనెటీగల విజృంభణ.. - Sakshi

తేనెటీగల విజృంభణ..

నేపాల్ భూకంపం వల్ల ఏర్పడిన ప్రకంపనలు శనివారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌నూ తాకాయి.

హజారీబాగ్: నేపాల్ భూకంపం వల్ల ఏర్పడిన ప్రకంపనలు శనివారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌నూ తాకాయి. హజారీబాగ్‌లో ప్రకంపనల వల్ల పలు భవనాల గోడలపై ఉన్న 24 తేనెతుట్టెలు కదిలిపోవడంతో భారీ సంఖ్యలో తేనెటీగలు వెల్లువెత్తాయి. నగరంలోని జీవన్‌జ్యోతి క్యాంపస్, ఎల్‌ఐసీ భవనాల నుంచి విజృంభించిన ఈ తేనెటీగలు 33వ జాతీయ రహదారిపైకి పోటెత్తాయి.

దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు కొన్ని నిమిషాలపాటు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అయితే, ప్రయాణికులెవరినీ తేనెటీగలు కుట్టలేదని, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి తమ తేనెతుట్టెలకు వెళ్లిపోయాయని స్థానికులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement