'బ్యాన్ చేయడం వల్ల సమస్యలు పోతాయా?' | Banning Pakistan artistes will not do any good says M S Sathyu | Sakshi
Sakshi News home page

'బ్యాన్ చేయడం వల్ల సమస్యలు పోతాయా?'

Oct 5 2016 10:40 AM | Updated on Sep 4 2017 4:17 PM

'బ్యాన్ చేయడం వల్ల సమస్యలు పోతాయా?'

'బ్యాన్ చేయడం వల్ల సమస్యలు పోతాయా?'

పాకిస్థాన్ నటులపై నిషధం విధించడం వల్ల ఇరు దేశాల మధ్య సమస్యకు ఎలాంటి పరిష్కారం జరగదని, వారిని నిషేధించడం సబబు కాదని ప్రముఖ చిత్ర దర్శకుడు మైసూర్ శ్రీనివాస్ సాథ్యు(86) అన్నారు.

ముంబయి: పాకిస్థాన్ నటులపై నిషధం విధించడం వల్ల ఇరు దేశాల మధ్య సమస్యకు ఎలాంటి పరిష్కారం జరగదని, వారిని నిషేధించడం సబబు కాదని ప్రముఖ చిత్ర దర్శకుడు మైసూర్ శ్రీనివాస్ సాథ్యు(86) అన్నారు. మంగళవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాక్ ఆర్టిస్టులపై నిషేధం అంశాన్ని ప్రస్తావిస్తూ..

'ఈ నిర్ణయం పాకిస్థాన్ భారత్ మధ్య సమస్యకు పరిష్కారం కాదు. చాలా ఏళ్లుగా ప్రముఖ సంగీత దర్శకులు, ఆర్టిస్టులు పాకిస్థాన్ నుంచి భారత్ కు వస్తున్నారు. ఇప్పుడు మాత్రం చాలామంది వారిని నిషేధించాలని అంటున్నారు. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని నేను అనుకోను' అని సాథ్యు అన్నారు. ఐపీటీఏ కార్యక్రమానికి పాక్ నటులు ఆహ్వానించడాన్ని సమర్థించారా అని ప్రశ్నించగా ఎందుకు ఆహ్వానించకూడదు అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement