వ్యవసాయానికి రుణాల దన్ను! | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి రుణాల దన్ను!

Published Tue, Jan 31 2017 4:50 AM

వ్యవసాయానికి రుణాల దన్ను! - Sakshi

  • రుణాల లక్ష్యం మరో రూ.లక్ష కోట్ల పెంపు
  • రూ.9 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు  
  • న్యూఢిల్లీ: ఈసారి వ్యవసాయ రంగానికి రుణాల విషయంలో అధిక ప్రాధాన్యమివ్వాలని కేంద్రం భావిస్తోంది. రాబోయే బడ్జెట్లో ఏకంగా వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన రుణాల లక్ష్యాన్ని రూ.1 లక్ష కోట్ల మేర పెంచవచ్చని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్లో ఈ రంగానికివ్వాల్సిన రుణాల లక్ష్యాన్ని రూ.9 లక్షల కోట్లుగా నిర్దేశించారు. ఈసారి రూ.10 లక్షల కోట్లకు పెంచనున్నట్లు సమాచారం.

    2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ నుంచి డిసెంబరు మధ్య బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.7.58 లక్షల రుణాలు మంజూరు చేశాయి. మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని దాటిపోవచ్చని కూడా కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రూ.10,000 కోట్లు కేటాయించవచ్చని ఆ వర్గాలు తెలియజేశారు. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో కేంద్రం రూ.5,500 కోట్లు మాత్రమే కేటాయించింది. తరవాత దీన్ని సవరించి రూ.13,000 కోట్లకు పెంచింది.  
    నాలుగు విభాగాలుగా నిధుల కేటాయింపు

Advertisement
 
Advertisement
 
Advertisement