తనకు దొరికిన రూ.50 వేల విలువైన వస్తువులను తిరిగిచ్చి తన నిజాయితీని చాటుకున్నాడో అటో డ్రైవర్. జైరాం అశోక్ ఖర్వాల్(27) ముంబైలోని మాల్వాని ప్రాంతంలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఆటో డ్రైవర్ నిజాయితీ
May 9 2016 1:17 PM | Updated on Sep 3 2017 11:45 PM
మాల్వాని: తనకు దొరికిన విలువైన వస్తువులను తిరిగి యజమానికి అప్పగించి నిజాయితీని చాటుకున్నాడో ఆ ఆటో డ్రైవర్. జైరాం అశోక్ ఖర్వాల్(27) ముంబైలోని మాల్వాని ప్రాంతంలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బందూప్ కు చెందిన అమిత్ నాయర్ శనివారం జైరాం ఆటో ఎక్కాడు. అయితే దిగే హడావుడిలో తన బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయాడు. ఆ బ్యాగ్ లో రూ.50వేల విలువైన ఐపాడ్, సామ్ సంగ్ టాబ్లెట్ ఉన్నాయి. ఆటోలో బ్యాగ్ ఉండటం గమనించిన జైరాం అశోక్ మాల్వాని పోలీసు స్టేషన్ లో అప్పగించాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసు ఇన్స్పెక్టర్ అతనికి రివార్డు ఇస్తామని ప్రకటించాడు.
Advertisement
Advertisement