వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపుపై దాఖలైన అత్యాచారం కేసులో సాక్షిపై యాసిడ్ దాడి జరిగింది. ఆశారాం బాపు, ఆయన కొడుకు నారాయణసాయి ఇరువురూ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
సూరత్: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపుపై దాఖలైన అత్యాచారం కేసులో సాక్షిపై యాసిడ్ దాడి జరిగింది. ఆశారాం బాపు, ఆయన కొడుకు నారాయణసాయి ఇరువురూ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీరిపై దాఖలైన కేసుల్లో సాక్షులపై దాడి జరగడం ఇది మూడోసారి. ఆశారాం కేసులో వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చిన దినేష్ భావ్‌చందానీ(39) ఆదివారం సూరత్‌లోని తన నివాసానికి వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ పోశారని డీసీపీ శోభాభూటీ తెలిపారు.
అహ్మదాబాద్ సమీపంలోని ఆశ్రమంలో 1997 నుంచి 2006 మధ్య కాలంలో ఆశారాంబాపు తనపై పలుమార్లు అత్యాచారం చేశారని ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సోదరి కూడా.. తనపై ఆశారాంబాపు కుమారుడు నారాయణసాయి అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆశారాంబాపు ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో ఉన్నారు.