'ఇక్కడ కూడా అదే రిపీటవుద్ది' | 'Assam Will Repeat Bihar For BJP', Says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

'ఇక్కడ కూడా అదే రిపీటవుద్ది'

Dec 13 2015 1:56 PM | Updated on Aug 15 2018 6:34 PM

'ఇక్కడ కూడా అదే రిపీటవుద్ది' - Sakshi

'ఇక్కడ కూడా అదే రిపీటవుద్ది'

అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో కూడా విజయభావుటా ఎగురవేస్తామని, బీజేపీని మరోసారి ఓడిస్తామని అన్నారు.

బార్పెటా: అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో కూడా విజయభావుటా ఎగురవేస్తామని, బీజేపీని మరోసారి ఓడిస్తామని అన్నారు. బార్పెటా జిల్లాలోని ఓ ఆలయం నుంచి ఏడు కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన ఆయన ఓ మసీదువద్ద ముగించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అందుకే అసోం ప్రజలు ఆయనను తిరస్కరించడం ఖాయమని అన్నారు. బిహార్ ప్రజలు మోదీని తిరస్కరించి ఢిల్లీకి వెళ్లిపోండి అని చెప్పారని, అసోంలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. బార్పెటా జిల్లాలో 70శాతం మంది ముస్లిం జనాభా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement