అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో బీజేపీ నేత అరెస్ట్ | Assam BJP Leader Arrested For Attempting To Rape Woman | Sakshi
Sakshi News home page

అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో బీజేపీ నేత అరెస్ట్

May 16 2020 8:01 AM | Updated on May 16 2020 8:27 AM

Assam BJP Leader Arrested For Attempting To Rape Woman - Sakshi

గుహ‌వాటి : ఓ మ‌హిళ‌పై అత్యాచారానికి ఒడిగ‌ట్టాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అస్సాం బీజేపీ మెర్చా నాయ‌కుడిని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. నిందితుడిని కమ్రుల్ హోక్ ​​చౌదరిగా గుర్తించారు. మే 11న త‌న ఇంట్లో అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డ్డాడ‌ని మ‌హిళ త‌న ఫిర్యాదు చేసింది. నిందితుడు మ‌హిళ ప్రైవేట్ భాగాల‌ను తాకిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై ఐపిసి సెక్షన్లు 376 (అత్యాచారం), 511 (శిక్షార్హమైన నేరాలకు ప్రయత్నించడం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు న‌మోదుచేసి అరెస్ట్ చేసిన‌ట్లు హోజాయ్ జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ సుమన్ చక్రవర్తి తెలిపారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి క‌స్ట‌డీకి పంపిన‌ట్లు పేర్కొన్నారు. మ‌హిళ‌పై అత్యాచారయ‌త్నానికి పాల్ప‌డినందుకు కమ్రుల్ హోక్ ​​చౌదరిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్న‌ట్లు అస్సాం బీజేపీ ప్ర‌క‌టించింది. (లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌.. ఎమ్మెల్యే అరెస్ట్ )


 

Advertisement
 
Advertisement
Advertisement