జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు | Arun Jaitley should apologise to female fraternity: Shobha Oza | Sakshi
Sakshi News home page

జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు

Aug 22 2014 10:08 PM | Updated on Aug 20 2018 5:17 PM

జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు - Sakshi

జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు

నగరంలో అత్యాచార ఘటనలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

మహిళా కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ: నగరంలో అత్యాచార ఘటనలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జైట్లీ వ్యాఖ్యలకు నిరసనగా అశోకారోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్పటికీ పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ విషయమై మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శోభా ఓజా మీడియాతో మాట్లాడుతూ ‘తాను త ప్పు చేశాననే విషయాన్ని జైట్లీ నిర్మొహమాటంగా అంగీకరించాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాగా నగరంలో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల పర్యాటక రంగం దెబ్బతిందంటూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement