హార్దిక్‌ పటేల్‌పై అరెస్ట్‌ వారంట్‌

Arrest warrant against Patidar leader Hardik Patel  - Sakshi

గుజరాత్‌: పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌కు కోర్టు షాక్‌నిచ్చింది. 2015లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయం ధ్వంసం కేసుకు సంబంధించి రెండోసారి కూడా కోర్టుకు హజరుకాకపోవడంపై బుధవారం విస్నాగర్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హార్దిక్‌పై నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో మరో ఆరుగురికి కూడా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తూ సెషన్స్‌ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్‌ ఉత్తర్వులిచ్చారు. హార్దిక్‌ తరఫు లాయర్‌ వాదిస్తూ.. బిజీ షెడ్యూల్‌ కారణంగా హార్దిక్‌ కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని, అందువల్ల ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు తిరస్కరించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top