
చైబాసా: కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి పరువు నష్టం కేసులో జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూన్ 26వ తేదీన స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ రాహుల్ లాయర్ చేసిన వినతిని తోసిపుచ్చింది. 2018లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షాకు వ్యతిరేకంగా రాహుల్..‘హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం బీజేపీ అధ్యక్షుడవుతారు’అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలందరి మనోభావాలను దెబ్బతీశారంటూ ఆ పార్టీ నేత ప్రతాప్ కటియార్ చైబాసాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ/ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి ఈ పిటిషన్ బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ రాహుల్ గాం«దీకి పలుమార్లు సమన్లు పంపారు. వీటిని ఆయన పట్టించుకోకపోవడంతో బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. దీంతో, రాహుల్ స్టే కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను 2024 మార్చిలో న్యాయస్థానం కొట్టివేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సైతం చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, మరింత కఠినమైన నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపింది.