'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు | Another four members get place in jayalalitha cabinet | Sakshi
Sakshi News home page

'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు

May 23 2016 6:48 PM | Updated on Aug 29 2018 1:59 PM

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది.

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది. 'అమ్మ' మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువాళ్లకు స్థానం దక్కింది. తెలుగువాడైన హోసూయ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి, రాజాకు ఐటీ శాఖను జయలలిత కేటాయించింది.

కొత్తగా 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న జయలలిత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, డీఎంకే నేత స్టాలిన్ హాజరయ్యారు.  గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక  ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement