బిగ్‌బీకి ‘గ్లోబల్ డైవర్సిటీ’ అవార్డు | Amitabh Bachchan to be honoured with Global Diversity Award | Sakshi
Sakshi News home page

బిగ్‌బీకి ‘గ్లోబల్ డైవర్సిటీ’ అవార్డు

Sep 12 2013 3:04 AM | Updated on Sep 1 2017 10:37 PM

బిగ్‌బీకి ‘గ్లోబల్ డైవర్సిటీ’ అవార్డు

బిగ్‌బీకి ‘గ్లోబల్ డైవర్సిటీ’ అవార్డు

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ గురువారం ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ డైవర్సిటీ అవార్డు’ను అందుకోనున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంటులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

నేడు బ్రిటన్ పార్లమెంటులో ప్రదానం
 ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ గురువారం ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ డైవర్సిటీ అవార్డు’ను అందుకోనున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంటులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ ఈ మేరకు తన బ్లాగులో పోస్టు రాశారు. కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement