ప్లీజ్‌.. నన్ను పిలవొద్దు! | Amitabh Bachchan pleads to West Bengal CM Mamata Banerjee | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. నన్ను పిలవొద్దు!

Nov 11 2018 5:06 AM | Updated on Nov 11 2018 5:06 AM

Amitabh Bachchan pleads to West Bengal CM Mamata Banerjee - Sakshi

కోల్‌కతా: 24వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ కార్యక్రమంలో శనివారం సరదా సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలాసార్లు అతిథిగా హాజరయ్యానని, ఇకపై తనని ఆహ్వానించొద్దని మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ విజ్ఞప్తి చేయగా, అలా కుదరదంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలూపారు. అమితాబ్‌ మాట్లాడుతూ పదేపదే ఈ కార్యక్రమానికి రావడం వల్ల తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఇకపై తనని ఆహ్వానించొద్దని పలుమార్లు వేడుకున్నా సీఎం వినడంలేదని అన్నారు. అందుకే బెంగాలీలో ’మేడం దయచేసి నా మాటలు వినండి. ఇకపైనైనా నాకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వండి’ అని విజ్ఞప్తిచేశారు. వచ్చే ఏడాది జరగబోయేది 25వ వేడుక కాబట్టి అప్పుడు కూడా అమితాబ్‌ రావాల్సిందేనని మమతా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement