మావోయిస్టుల దాడి రాజకీయ కుట్ర

Amit Shah Demands CBI Probe In Bheema Mandavi Murder - Sakshi

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆరోపణ 

బీజేపీ ఎమ్మెల్యే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ 

రాజ్‌నంద్‌గావ్‌(ఛత్తీస్‌గఢ్‌): దంతెవాడలో ఎమ్మెల్యే భీమా మాండవిని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్న ఘటనను రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌నంద్‌గావ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని డొంగర్‌గావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే మాండవిపై మావోయిస్టుల దాడి సాధారణ ఘటన కాదు, అది రాజకీయ కుట్ర గా భావిస్తున్నాం. మాండవి భార్య కూడా సీబీ ఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ ఘటనలో నిజాలు వెలికి తీయాలని ముఖ్యమంత్రి బఘేల్‌ నిజంగా భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’అని కోరా రు. 

‘సీబీఐ అంటే సీఎం బఘేల్‌ ఎందుకు భయపడుతున్నారు? దర్యాప్తు సంస్థ ముం దుగా తమ అనుమతి తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులిచ్చారు?’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకం గా ప్రధానమంత్రిని నియమించాలన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మౌనం వీడి వైఖ రిని స్పష్టం చేయాలన్నారు. భారత్‌ నుంచి కశ్మీర్‌ విడిపోవాలని ఈ నేతలు కోరుకుంటున్నా రని ఆరోపించారు. చిట్టచివరి బీజేపీ కార్యకర్త ఉన్నంతవరకు దేశం నుంచి కశ్మీర్‌ను ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి అనంతరం దేశ ప్రజలం తా సంబరాలు జరుపుకుంటే పాకిస్తాన్‌తోపాటు కాంగ్రెస్‌ కార్యాలయంలోనూ విషాదచాయలు అలుముకున్నాయని ఎద్దేవా చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top