ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్‌ వీరంగం

Akhilesh Yadav Bullies Govt Doctor Treating Patients At Kannauj Hospital - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు కన్నౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ అక్కడి వైద్యుడిని దుర్భాషలాడిన వీడియో వైరల్‌గా మారింది. కన్నౌజ్‌ జిల్లా దేవార్‌ మార్గ్‌లో శుక్రవారం రాత్రి ఓ ట్రక్కును ఢీకొన్న డబుల్‌ డెక్కర్‌ బస్సు మంటల్లో చిక్కుకున్న దుర్ఘటనలో 21 మంది మరణించగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో​గాయపడి కన్నౌజ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తుండగా ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పరిహారం అందలేదని బాధితులు చెబుతున్న క్రమంలో అక్కడే ఉన్న సీనియర్‌ వైద్యుడు ఏదో వివరించబోగా అఖిలేష్‌ ఆయనపై మండిపడ్డారు. ‘మీరు ప్రభుత్వ తొత్తులని మాకు తెలుసు..మీరు మాట్లాడవద్దు..మీరు బీజేపీ లేదా ఆరెస్సెస్‌ మనిష’ని ఆయనపై విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ మీరు ఏమీ చెప్పద్దు..నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదం’టూ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేశారు. కాగా అఖిలేష్‌ ఆగ్రహానికి గురైంది ఎమర్జెన్సీ మెడికల్‌ అధికారి డాక్టర్‌ డీఎస్‌ మిశ్రాగా గుర్తించారు. రోగుల్లో ఒకరు తనకు పరిహారం చెక్‌ అందలేదని చెబుతుండగా తాను అక్కడే ఉన్నానని బాధితులకు చెక్‌ అందిందని చెబుతుంగా అఖిలేష్‌ ఆగ్రహావేశాలకు లోనై తనను అక్కడి నుంచి వెళ్లాలని కోరారని డాక్టర్‌ మిశ్రా చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top