తైవాన్‌ కాదు.. ఇక చైనీస్‌ తైపీ

Air India site renames Taiwan as Chinese Taipei - Sakshi

ఎయిరిండియా సైట్‌లో పేరు మార్పు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా(ఏఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్‌(రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా) పేరును తమ అధికారిక వెబ్‌సైట్‌లో చైనీస్‌ తైపీగా మార్పు చేసింది. తైవాన్‌ భౌగోళిక స్థితితో పాటు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిపై తైవాన్‌ తీవ్రంగా మండిపడింది. ఎయిర్‌ఇండియా నిర్ణయంపై తాము తీవ్రంగా నిరాశ చెందామని  ఢిల్లీలోని తైపీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం(టీఈసీసీ) తెలిపింది.  చైనా నుంచి వస్తున్న అర్థంలేని ఒత్తిడికి తలొగ్గి భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నామని టీఈసీసీ విమర్శించింది. వెంటనే తమ దేశం పేరును వెబ్‌సైట్‌లో తైవాన్‌గా పునరుద్ధరించాలని ఎయిర్‌ ఇండియాను డిమాండ్‌ చేసింది. ఏదేమైనా ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది. కాగా, ఎయిరిండియాకు విదేశాంగ శాఖ మద్దతుగా నిలిచింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top