కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి |  Ahmedabad 2 killed, 26 injured after joyride with crashes at adventure park | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన జాయ్‌ రైడ్‌ : ఇద్దరు మృతి

Jul 15 2019 7:41 AM | Updated on Jul 15 2019 11:46 AM

 Ahmedabad 2 killed, 26 injured after joyride with crashes at adventure park - Sakshi

గుజరాత్‌లోని అ‍డ్వెంచర్‌ పార్క్‌లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. జాయ్‌రైడ్ (కొలంబస్‌ లాంటిది) అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ మణినగర్‌లోని అడ్వెంచర్ పార్కులో  ఈ ఘటన చోటు  చేసుకుంది.

ఆదివారం సెలవు రోజు సరదాగా అలా పార్క్‌ వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనూహ్యంగా ఇక తిరిగి రాని లోకాలకు తరలి పోయారు. మరో 29 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన వారిని మణినగర్‌లోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని నగర మేయర్‌ బిజాల్‌ పటేల్‌ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అహ్మదాబాద్ మునిసిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. ప్రధాన షాఫ్ట్ పైపు విరిగి నేలమీద కుప్పకూలిందని, దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) దర్యాప్తు  చేస్తోందని చీఫ్‌  ఫైర్‌ ఆఫీసర్‌ దస్తూర్  వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement