వైరల్‌: వీధి కుక్కను ఇంటర్వ్యూ చేసిన నటి

Actress Aditi Bhatia Interviews Dog In IIFA Awards - Sakshi

ముంబై : ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క తళుక్కుమంది. ఓ నటి ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం  ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి  వెళితే.. రెండు రోజుల క్రితం ఐఫా వేడుకలు జరుగుతున్న ప్రదేశంలోకి ఓ వీధి కుక్క చొరబడింది. గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు పచార్లు చేయటం మొదటుపెట్టింది. అక్కడ కుక్కు తిరుగుతుండటం నటి అదితి భాటియా కంటపడింది. దీంతో ఆమె మైక్‌ పట్టుకుని ఆ కుక్కను ఇంటర్వ్యూ చేశారు. మొదట ఆ కుక్కను పలకరించగానే అది ప్రేమగా ఆమెతో కరచాలనం! చేసింది. అనంతరం ఆమె కొన్ని ప్రశ్నలు అడగ్గా మౌనంతోనే సమాధానం చెప్పింది. అదితి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. షేర్‌ చేసిన రెండు రోజుల్లోనే ఈ వీడియో 6 లక్షల వ్యూస్‌ సంపాదించుకుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top