ప్రయాణికులకు చుక్కలు చూపిన ఏసీ ట్రైన్‌ | AC Not Working In Mumbai local AC Train | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు చుక్కలు చూపిన ఏసీ ట్రైన్‌

Jun 22 2018 6:50 PM | Updated on Oct 2 2018 8:10 PM

AC Not Working In Mumbai local AC Train - Sakshi

ముంబై : ముంబైలో ఓ లోకల్‌ ఏసీ సర్వీస్‌ రైలు శుక్రవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ట్రైన్‌లోని కొన్ని కోచ్‌లలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం బోరివాలి స్టేషన్‌ దాటక ట్రైన్‌లో ఒక్కసారిగా కొన్ని కోచ్‌లలో ఏసీలు ఆగిపోవడంతో.. ఉష్ణోగ్రత క్రమంగా 36 డిగ్రీలకు చేరుకుంది. ట్రైన్‌ డోర్లు మూసి ఉండేవి కావడంతో ఊపిరాడక, ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహా, ఆవేశాలకు లోనైనా కొందరు ప్రయాణికులు చైన్‌ లాగి ట్రైన్‌ని అంధేరిలో నిలిపివేశారు.
 
ట్రైన్‌ను పరిశీలించిన అధికారులు.. ఏసీ ఫెయిల్‌ కావడానికి కారణాలు తెలియకపోవడంతో దానిని షెడ్‌కు తరలించారు. ఈ సమస్యను ప్రయాణికులు ట్విటర్‌లో రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ ఈ ఘటనపై క్షమాపణ తెలిపింది.3 కోచ్‌లలో ఈ సమస్య తలెత్తినట్టుగా పేర్కొంది.  పశ్చిమ రైల్వే ముంబైలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి గతేడాది డిసెంబర్‌లో 12 ఏసీ సర్వీస్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement