
80ఏళ్ల బామ్మ.. 102 ఏళ్ల అత్తకు గిఫ్ట్‌గా..!
అత్తనే అమ్మగా భావించిన 80 ఏళ్ల కోడలు.. మాతృ దినోత్సవం రోజున 102ఏళ్ల అత్తకు బహుమతి ఇచ్చింది.
కాన్పూర్: అత్తనే అమ్మగా భావించిన 80 ఏళ్ల కోడలు.. మాతృ దినోత్సవం రోజున 102ఏళ్ల అత్తకు బహుమతి ఇచ్చింది. బహిర్భుమికి బయటకు వెళ్లకుండా ఉండేందుకు టాయిలెట్‌ను నిర్మించి బహుమతిగా అందించింది. ఇందుకోసం తనకున్న ఆరు మేకలను అమ్మిసేంది. అత్త అనుకోకుండా ఓ రోజు జారి పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో ఆమెకు టాయిలెట్‌ను నిర్మించి ఇవ్వాలని కోడలు నిర్ణయించుకుంది. అందుకోసం జీవనోపాధి అయిన మేకలను అమ్మడానికి కూడా ఆమె వెనుకాడలేదు.