పిట్ట కొంచెం..కూత ఘనం | 7-year-old city girl drives 10-wheeled lorry ! | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచెం..కూత ఘనం

Nov 6 2017 8:59 AM | Updated on Nov 6 2017 8:59 AM

7-year-old city girl drives 10-wheeled lorry ! - Sakshi

లారీ నడుపుతున్న రిఫా

మైసూరు: పెద్దవాళ్లు సైతం విస్తుపోయేలా బైకులు, కార్లను అలవోకగా నడుపుతూ ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏడేళ్ల బాలిక రిఫా తాజాగా   లారీని నడిపి గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వాల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించారు. నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రిఫా తష్కిన్‌ ఇటీవల ముగిసిన దసరా ఉత్సవాల్లో కూడా బైకులు, కార్లతో సాహస విన్యాసాలు చేసి ఔరా అనిపించుకున్నారు. తమ సాహస విన్యాసాలతో గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాందిచాలనే కాంక్షతో ఆదివారం నగరంలోని ఈద్గా మైదానంలో అశోక్‌ లైలాండ్‌తో పాటు పదమూడు రకాల వాహనాలతో సాహస విన్యాసాలు చేశారు. ఏడేళ్ల ప్రాయంలోనే రిఫా చేస్తున్న సాహస విన్యాసాలు ప్రతీఒక్కరినీ అబ్బుపరిచాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement