breaking news
Seven years Child
-
పిట్టకొంచెం.. ‘వ్యూస్’ ఘనం..
సాక్షి, కామారెడ్డి: ఆ బుడతడి వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి.. కానీ అతడు చేసే యాక్టింగ్ యూట్యూబ్‌లో నవ్వులు పూయిస్తోంది. లక్షలాది మందికి ఆనందం పంచుతోంది. ఫెమోప్స్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు రేసులో నిలిచిన చతురణన్పై సండేస్పెషల్.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అర్చన, సంతోష్ దంపతుల కుమారుడైన చతురణన్ బుడిబుడి అడుగులు వేసేటప్పుడే టీవీల్లో వస్తున్న సినిమాలను చూసి దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేసేవాడు. మూడేళ్ల వయసులోనే ఎంతో శిక్షణ తీసుకున్నవాడిలా నృత్యం చేయడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. డ్యాన్స్‌ను వీడియో తీసి బంధువులకు, స్నేహితులకు పంపించేవారు. అందరూ చతురణన్ డ్యాన్స్‌ను చూసి మురిసిపోయేవారు. స్కూ ల్ నుంచి రాగానే టీవీలో ఏదో ఒక పాట పెట్టుకోవడం, డ్యాన్స్ చేయడం చేసేవాడు. కొడుకులో ఉన్న టాలెంట్‌ను గమనించిన తండ్రి సంతోష్.. వివిధ సినిమాల పాటలు, టీజర్లను చూపించి, అలాగే చేయమంటూ ప్రోత్సహించాడు. కుమారుడి నటనను కెమెరాలో బంధించేవాడు. ఒక సినిమా టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. దాన్ని మించి నటిస్తూ అందరినీ ఆకట్టుకోసాగాడు. తర్వాత ‘చతుర్ డార్లింగ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. చతురణన్ వీడియోలను అందులో అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే 39 వీడియోలు... చతురణన్ యాక్టింగ్‌కు సంబంధించి యూట్యూ బ్లో ఇప్పటివరకు 39 వీడియోలను అప్లోడ్ చేశారు. చానల్‌కు సుమారు 6 వేల మంది సబ్స్క్రైబర్లున్నారు. వేలమంది వీడియోలను వీక్షి స్తున్నారు. ‘పుష్ప’ స్పూఫ్స్ను లక్షలాది మంది చూశారు. బీమ్లానాయక్ టీజర్ స్పూఫ్సైతం నవ్వులు పూయిస్తోంది. వాటిని చూసివారు ఈ బుడ్డోడు మామూలోడు కాదంటున్నారు. అవార్డు రేసులో... ఫెమోప్స్ ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్–2022 బెస్ట్ యాక్టింగ్ కేటగిరిలో చతురణన్ నామినేట్ అయ్యాడు. ఈనెల 15 వరకు ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. అత్యధిక ఓట్లు పొందిన వారిని విన్నర్‌గా ప్రకటించి, ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారని చతురణన్ తండ్రి సంతోష్ తెలిపారు. నటనతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న ఈ బుడ్డోడు.. అవార్డు రేసులో ఎంతవరకు నెగ్గుకువస్తాడో చూడాలి. మూడేళ్ల నుంచే.. మా బాబుకు చిన్నప్పటినుంచే యాక్టింగ్ అంటే ఇష్టం. మూడేళ్ల వయసులోనే వాడిలోని ప్రతిభను గమనించాం. ప్రోత్సహిస్తుండడంతో చాలాబాగా నటిస్తున్నాడు. వాటిని యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాను. వ్యూయర్స్నుంచి మంచి స్పందన వస్తోంది. – సంతోష్, చతురణన్ తండ్రి, కామారెడ్డి -
పిట్ట కొంచెం..కూత ఘనం
మైసూరు: పెద్దవాళ్లు సైతం విస్తుపోయేలా బైకులు, కార్లను అలవోకగా నడుపుతూ ప్రతీ ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏడేళ్ల బాలిక రిఫా తాజాగా లారీని నడిపి గోల్డెన్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డులో స్థానం సంపాదించడానికి ప్రయత్నించారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రిఫా తష్కిన్ ఇటీవల ముగిసిన దసరా ఉత్సవాల్లో కూడా బైకులు, కార్లతో సాహస విన్యాసాలు చేసి ఔరా అనిపించుకున్నారు. తమ సాహస విన్యాసాలతో గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాందిచాలనే కాంక్షతో ఆదివారం నగరంలోని ఈద్గా మైదానంలో అశోక్ లైలాండ్తో పాటు పదమూడు రకాల వాహనాలతో సాహస విన్యాసాలు చేశారు. ఏడేళ్ల ప్రాయంలోనే రిఫా చేస్తున్న సాహస విన్యాసాలు ప్రతీఒక్కరినీ అబ్బుపరిచాయి. -
ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం?
కొత్తూరు: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారిపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. ఏదో ఓ చోట నిత్యం వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తూరులో ఓ గుర్తుతెలియని మానవమృగం ముద్దులొలికే ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా చిరువ్యాపారం చేసుకుంటూ కొత్తూరులో నివాసం ఉంటుంది. ఏడేళ్ల తన కూతురిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదివిస్తోంది. కాగా, ఈ నెల 10వ తేదీన రాత్రి 8గంటల సమయంలో కూతురు కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన పాప, జరిగిన విషయం తల్లికి చెప్పింది. తర్వాతి రోజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం ఏఎస్పీ కల్మేశ్వర్ సింగనవర్, రూరల్ సీఐ మధుసూదన్, ఎస్ఐలు శ్రీశైలం, వీరబాబు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించామని, వైద్యుల రిపోర్టు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని సీఐ మధుసూదన్ పేర్కొన్నారు.