మంచు చరియలు పడి ఐదుగురు మృతి | 5 dead, 5 feared trapped as avalanche hits Khardung La in Ladakh | Sakshi
Sakshi News home page

మంచు చరియలు పడి ఐదుగురు మృతి

Jan 19 2019 4:12 AM | Updated on Apr 4 2019 5:25 PM

5 dead, 5 feared trapped as avalanche hits Khardung La in Ladakh - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని లడఖ్‌ పరిధిలోని ఖర్దంగ్‌లో శుక్రవారం మంచు చరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు ఖర్దంగ్‌లాకు చేరుకుంది. అదే సమయంలో ఆ ట్రక్కుమీదుగా ఒక్కసారిగా మంచుతో కూడుకున్న కొండచరియలు విరిగిపడటంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించారు. మరో ఐదుగురి జాడ తెలియలేదు. శిథిలాల్లో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కనిపించకుండా పోయిన వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు బోర్డర్‌ రోడ్ల ఆర్గనైజేషన్‌ అధికారులు మీడియాకు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement