నదిలో బస్సు పడి 37 మంది మృతి | 37 killed as bus plunges into river in Gujarat | Sakshi
Sakshi News home page

నదిలో బస్సు పడి 37 మంది మృతి

Feb 5 2016 9:36 PM | Updated on Sep 3 2017 5:01 PM

నదిలో బస్సు పడి 37 మంది మృతి

నదిలో బస్సు పడి 37 మంది మృతి

గుజరాత్ లో నదిలోకి బస్సు పడిన ప్రమాదంలో 37 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు.

అహ్మదాబాద్: గుజరాత్ లో నదిలోకి బస్సు పడిన ప్రమాదంలో 37 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రం నవ్సారి నుంచి ఉకైకు ప్రయాణికులతో వెళ్తున్న గుజరాత్ రాష్ట్ర రవాణ బస్సు బ్రిడ్జిపై అదుపు తప్పి పూర్ణ నదిలో పడింది.

నదిలో నుంచి 20 మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement