ఈసీ పరీక్షలో 323 అధికారులు ఫెయిల్‌

323 govt officers fail EC-conducted test in MP - Sakshi

భోపాల్‌: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో.. ఎలక్షన్ల కోసం సన్నద్ధమవుతున్న ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర అధికారులు కొందరు షాకిచ్చారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించాల్సిన విధులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో 323 మంది అధికారులు కనీస ప్రతిభ కూడా చూపడంలో ఫెయిలయ్యారు. దీంతో ఈసీ అధికారులు అవాక్కయ్యారు. ఇందులో సబ్‌–డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ (గ్రూప్‌–1, డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్‌లు) స్థాయి అధికారులు కూడా ఉన్నారు.

భోపాల్, సెహోర్, హోషంగాబాద్, రాఘోఘట్, గునా, గ్వాలియర్, ఇండోర్, ఛతర్‌పూర్‌ తదితర జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్‌లో కీలక పాత్రల్లో ఈ అధికారులు నియమితులయ్యారు. దాదాపు 700 మంది అధికారులకు ఎన్నికల విధుల నిర్వహణపై ఉన్న అవగాహనపై పరీక్ష నిర్వహించారు. ‘ఇది చాలా సీరియస్‌ అంశం. చాలా మంది అధికారులు పరీక్ష ఫెయిలయ్యారు. ఇలా ఉంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిపెట్టాలి’ అని ఆర్టీఐ కార్యర్త అజయ్‌ దుబే విమర్శించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top