భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం | 3 Terrorists Killed In Encounter With Forces In JKs Tral | Sakshi
Sakshi News home page

జమ్మూలో భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Feb 19 2020 10:38 AM | Updated on Feb 19 2020 11:20 AM

3 Terrorists Killed In Encounter With Forces In JKs Tral - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రాల్ సెక్టార్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపడుతున్న సైన్యంపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో త్రాల్‌ సెక్టార్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement