5 కిలోల ఇనుము వెలికితీసిన డాక్టర్లు | 263 Coins, Shaving Blades, Needles Found In Madhya Pradesh Man's Stomach | Sakshi
Sakshi News home page

5 కిలోల ఇనుము వెలికితీసిన డాక్టర్లు

Nov 27 2017 2:56 PM | Updated on Oct 8 2018 3:19 PM

263 Coins, Shaving Blades, Needles Found In Madhya Pradesh Man's Stomach - Sakshi

సాట్నా : మధ్యప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ ఆసుపత్రి వైద్యలు అరుదైన సర్జరీ నిర్వహించారు. ఓ వ్యక్తి కడుపు నుంచి ఐదు కిలోల ఇనుమును వెలికితీశారు. అందులో 263 కాయిన్లు, షేవింగ్‌ బ్లేడ్లు, సూదులు, గొలుసు ఉన్నాయి. బాధితుడు మహ్మద్‌ మసూక్‌ ఈ నెల 18వ తేదీన విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో వచ్చి చేరినట్లు వైద్యులు తెలిపారు.

బాధితుడికి ఎక్స్‌రేతో పాటు పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత కడుపులో ఇనుము సంబంధిత వస్తువులు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అనంతరం సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ఇనుము సంబంధిత వస్తువులను రోగి మింగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement