పెళ్లి బస్సుపై కరెంటు వైరు.. 25 మంది మృతి | 25 Killed After High-Tension Wire Falls on Bus in Rajasthan | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సుపై కరెంటు వైరు.. 25 మంది మృతి

Jun 12 2015 5:06 PM | Updated on Sep 3 2017 3:38 AM

పెళ్లి బస్సుపై కరెంటు వైరు.. 25 మంది మృతి

పెళ్లి బస్సుపై కరెంటు వైరు.. 25 మంది మృతి

రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఘోర విషాదం. ఒక పెళ్లిబస్సుపై హైటెన్షన్ విద్యుత్తీగలు తెగి పడిన ప్రమాదంలో 25 మంది కాలి బూడిదయ్యారు.

రాజస్థాన్ : రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఘోర విషాదం సంభవించింది. పెళ్లి బృందంతో  వెళ్తున్న బస్సు మీద హైటెన్షన్ కరెంటు వైరు తీగలు తెగి పడ్డాయి. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది కాలి బూడిదయ్యారు.  సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ రేఖాగుప్తా, ఎస్పీ దీపక్ కుమార్, ఇతర అధికారులు  సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఒక ప్రైవేటు బస్సు పెళ్లి బృందంతో వెళుతుండగా  పచేవార్ గ్రామ శివారు  ప్రాంతంలో  ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.  దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement