పీఎన్‌బీ కేసులో రూ.218 కోట్లు జప్తు

218 crore assets of Mehul Choksi, others - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారీ మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీ సన్నిహితుడు మిహిర్‌ భన్సాలీలకు సంబంధించి రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో భన్సాలీ విదేశాల్లో కొన్న రూ.51 కోట్ల ఫ్లాట్, చోక్సీ రూ.27 కోట్లతో మరో దేశంలో కొన్న విల్లా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ పేరుతో 2.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవంతి, ముంబైలోని ట్రంప్‌ టవర్‌లో రూ.1.7 కోట్లతో కొన్న ఫ్లాట్, నీరవ్‌కి చెందిన  రూ.18.76 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. తాజా జప్తుతో ఇప్పటివరకూ ఈడీ రూ.4,488 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top