హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి | 2 Army soldiers killed in avalanche in West Siachen | Sakshi
Sakshi News home page

హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి

Dec 1 2019 5:17 AM | Updated on Dec 1 2019 5:17 AM

2 Army soldiers killed in avalanche in  West Siachen - Sakshi

జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్‌లోని దక్షిణ సియాచిన్‌ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement