ఆర్టీఐకి 12 ఏళ్లు

12 years of RTI

సాక్షి, న్యూఢిల్లీ: సామాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి ఈ గురువారానికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ 12 ఏళ్లలో సమాచార హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే అవకాశం లభించింది. సమాచార హక్కు చట్టం గురించి కొన్ని ముఖ్యాంశాలు మీ కోసం..

  • దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సగటున రోజూ ఆర్టీఐ చట్టం కింద 4,800 దరఖాస్తులు నమోదవుతున్నాయి.
  • అక్టోబర్‌ 2005 నుంచి అక్టోబర్‌ 2016 వరకూ.. మొత్తం కోటి 75 లక్షల దరఖాస్తులు ఆర్టీఐ చట్టం కింద నమోదయ్యాయి.
  • ఒక్క 2015-16లోనే 11 లక్షల 75 వేల దరఖాస్తులు వచ్చాయి.
  • ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 65 మంది ఆర్టీఐ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. అదే విధంగా 400 మంది కార్యకర్తలను వివిధ రకాల వ్యక్తులు భయభ్రాంతులకు గురి చేశారు.
  • గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్టీఐపై ఇప్పటికీ అవగాహన లేదు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటినుంచీ ఇప్పటి వరకూ కేవలం 14 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
  • 2015-16 సంవత్సరంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు అత్యధికంగా 1.55 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెండోస్థానంలో సామాచర ప్రసార శాఖ ఉంది. ఈ శాఖకు మొత్తంగా 1.11 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top