వైద్యుల నిర్లక్ష్యానికి రూ. 1.8 కోట్ల పరిహారం | 1.8 crore rupess compensation for chennai teen, who lost vision | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి రూ. 1.8 కోట్ల పరిహారం

Jul 1 2015 8:27 PM | Updated on Aug 20 2018 9:35 PM

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ 18 ఏళ్ల యువతి కంటి చూపు కోల్పోయిన సంఘటనను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది.

చెన్నై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ 18 ఏళ్ల యువతి కంటి చూపు కోల్పోయిన సంఘటనను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితురాలికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది. అయితే తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నైకు చెందిన ఈ అమ్మాయి కంటి చూపు పోవడానికి కారణమయ్యారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె పుట్టకతోనే అందురాలిగా పుట్టింది. దీనిపై యువతి తండ్రి న్యాయపోరాటం చేశాడు. బాధితురాలికి భారీ పరిహారం ఇవ్వాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement