దారిద్య్రం

peoples facing problems with damaged roads - Sakshi

గతుకుల రోడ్డుపై గమ్యం చేరేదెలా?

కంకర తేలడంతో రాకపోకలకు వాహనదారుల అవస్థలు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

బల్మూర్‌ : కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అలసత్వంతో రోడ్ల పనుల్లో నాణ్యత కొరవడింది. మండలంలోని పంచాయతీ రాజ్‌ నిధులతో అనంతవరం నుంచి అంబగిరి, లక్ష్మీపల్లి, బిల్లకల్, వెంకటగిరి, బాణాల, రామాజిపల్లి, జిన్‌కుంట, గ్రామాలకు ఐదేళ్ల క్రితం బీటీ రోడ్లు వేశారు. రెండేళ్ల నుంచి ఆ రోడ్లపై కంకర తేలి గతుకులమయంగా మారాయి. దీంతో వాహనదారులు గమ్యం చేరాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు.
 
పనుల్లో నాణ్యాత లోపం
బీటీ రోడ్డు పనులు చేసే సమయంలో సరైన నాణ్యత ప్రమాణాలు æపాటించక పోవడం, అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఇష్టానుసారంగా పనులను చేసి బిల్లులు దండు కొంటుండటంతో కొద్ది కాలనికే రోడ్లు మరమ్మతుకు చేరుకుంటున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఐదేళ్లు పూర్తయినా కూడా ఈరోడ్లపై రెన్యూవల్‌ కోట్‌ పనులు చేయాల్సి ఉన్నా నిధులు మంజూరులో జాప్యం చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. గతుకుల మయంగా మారి న ఈ రోడ్లకు నిధులు మం జూరు చేసి పనులు ప్రారంభిం చాలని కోరుతున్నారు.

రాకపోకలకు ఇబ్బందులు
మా గ్రామానికి ఐదేళ్ల క్రితం వేసిన బీటీ రోడ్లు అప్పుడే కంకర తేలి గుంతల మయంగా మారాయి. రెండేళ్లుగా ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు కూడా తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్‌ నాసిరకంగా పనులు చేయడంతోనే రోడ్డు ఈ పరిస్థితికి చేరింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. రెన్యూవల్‌ కోట్‌ ప నులకు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టాలి.    

– వి.శ్రీనివాసులు, అంబగిరి, బల్మూర్‌

రెన్యూవల్‌ పనులకు నివేదిక పంపాం
మండలంలోని అంబగిరి, బాణాల, లక్ష్మీపల్లి, రామాజిపల్లి తదితర రోడ్లపై రెన్యూవల్‌ కోట్‌ బీటీ పనులకు రూ.3కోట్ల50లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు మంజూరైన వెంటనే జాప్యం లేకుండా పనులు పూర్తి చేయిస్తాం.        

జీజే రాబర్ట్, పీఆర్‌ ఏఈ, బల్మూర్‌ 

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top