‘జంజీర్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది’ | 'Zanjeer' a perfect debut film: Ankur Bhatia | Sakshi
Sakshi News home page

‘జంజీర్‌లో నటించినందుకు ఆనందంగా ఉంది’

Aug 23 2013 8:03 PM | Updated on Sep 1 2017 10:03 PM

జంజీర్ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని నూతన నటుడు అంకుర్ భాటియా తెలిపాడు.

న్యూఢిల్లీ: జంజీర్ సినిమాలో చేసినందుకు చాలా ఆనందంగా ఉందని నూతన నటుడు అంకుర్ భాటియా తెలిపాడు.  అమితాబ్ బచ్చన్ హీరోగా 1973 సంవత్సరంలో రూపొందిన సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమేనన్నాడు. ఈ సినిమాలో అంకుర్‌కు పెద్దగా డైలాగ్‌లు లేకపోయినా సినిమాలో నటించడం నిజంగానే అదృష్టమని పేర్కొన్నాడు. తాను బాలీవుడ్‌లో ప్రవేశించడానికి జంజీర్ చక్కటి వేదికవుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.  ఇందులో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్‌కు అంకుర్ కుడిభజంగా ఉంటాడు.  అపూర్వ లాఖియా తీసిన ఈ సినిమాలో రామ్ అమితాబ్ పాత్రలో కనిపిస్తాడు. ప్రియాంకచోప్రా ఇతనికి జోడీగా కనువిందు చేయనుంది.  
 
 గత రెండు- మూడు ఏళ్ల నుంచి న్యూయార్క్‌లోనే ఉంటూ సినిమాలు చేస్తున్నానని తెలిపాడు. భారతీయులకు హాలీవుడ్‌లో పెద్ద పాత్రలు  రావడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. త్వరలో భారత్‌కు వచ్చి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని భాటియా తెలిపాడు.
 
 గతంలో తాను ముంబైకు వచ్చి చాలాసార్లు అవకాశాలకోసం ప్రయత్నించానని, జంజీర్ దర్శకుడు అపూర్వ లాకియా ఈ సినిమాలో  తనకు మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించాడని తెలిపాడు. ప్రముఖలతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement