తెలుగు చిత్రానికి అపూర్వ లకియా దర్శకత్వం! | Apoorva Lakhia to make Telugu film | Sakshi
Sakshi News home page

తెలుగు చిత్రానికి అపూర్వ లకియా దర్శకత్వం!

Aug 20 2013 3:01 PM | Updated on Sep 1 2017 9:56 PM

తెలుగు చిత్రానికి అపూర్వ లకియా దర్శకత్వం!

తెలుగు చిత్రానికి అపూర్వ లకియా దర్శకత్వం!

టాలీవుడ్ లో మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లకియా వెల్లడించారు.

టాలీవుడ్ లో మరో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లకియా వెల్లడించారు. అయితే ఆ చిత్ర వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. తాను ఇంకా ఆ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం జంజీర్ మీదే నా దృష్టి ఉంది అని అపూర్వ అన్నాడు. కాని తనకు ఓ మంచి ఆఫర్ లభించిందని తెలిపాడు. 
 
ప్రస్తుతం జంజీర్ చిత్రాన్ని బాలీవుడ్ లోనూ, తూఫాన్ గా టాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్ మహీ గిల్, అతుల్ కులకర్ణిలు నటించిన చిత్రం సెప్టెంబర్ 6 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో మిషన్ ఇస్తాంబుల్, షూట్ అవుట్ ఎట్ లోకండ్ వాలా చిత్రానికి దర్శకత్వం వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement