కత్తిలాంటి ఫిగరుంది! | Yenti Raja Youth Ilaa Undi Teaser | Sakshi
Sakshi News home page

కత్తిలాంటి ఫిగరుంది!

Dec 11 2017 1:21 AM | Updated on Sep 18 2018 8:13 PM

Yenti Raja Youth Ilaa Undi Teaser - Sakshi

‘మా ఆఫీసులో ఓ కత్తిలాంటి ఫిగరుంది’.. అంటూ ప్రారంభమయ్యే ‘యేంటి రాజా యూత్‌  ఇలా ఉంది’ టీజర్‌ అలరిస్తోంది. ‘పోటుగాడు’ ఫేమ్‌ సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ఆది శేషసాయిరెడ్డి దర్శకత్వంలో లార్డ్‌ శివ క్రియేషన్స్‌ పతాకంపై ఎమ్వీఎస్‌. సాయి కృష్ణారెడ్డి నిర్మించారు. పర్వీన్‌ రాజ్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని ‘నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేశారు. శేష సాయిరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. నేటి సమాజంలో యువత ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తుంది.  అబ్బాయిలైనా, అమ్మాయిలైనా  జీవితాంతం ఒకరి తోడుగానే ఉండాలనే సందేశం ఇచ్చాం.  ఈ నెలాఖరున సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాగ రాకేష్, ఇంద్ర, సంతోష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శంకర్, సంగీతం: కిషన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement